हिन्दी | Epaper

Gudivada Crime: తలనొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

Aanusha
Gudivada Crime: తలనొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

Gudivada Crime: కృష్ణా జిల్లా గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో కాలనీలో బుధవారం ఒక హృదయ విదారక సంఘటన వెలుగుచూసింది. తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఒక యువకుడు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. చిరు వ్యాపారి అందే మల్లేశ్వరరావు కుమారుడు నాగ సతీష్ కుమార్ (28) ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Read Also: Hyderabad Crime: తండ్రి మందలించడంతో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

Gudivada Crime: Unable to bear the headache, a young man commits suicide
Gudivada Crime: Unable to bear the headache, a young man commits suicide

తలనొప్పి భరించలేక ఆత్మహత్యాయత్నం

గత కొంతకాలంగా నాగ సతీష్ కుమార్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు.అతడికి ఏలూరులోని ఆశ్రమం ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 24న రాత్రి బాగా తలనొప్పితో బాధపడగా బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళతానని చెప్పిన తండ్రి బయటకెళ్లాడు. తండ్రి తిరిగి వచ్చేలోగా అల్పాహారం తినాలని సతీష్ కుమార్ కు, తల్లి సూచించింది.

ఏమైందో కానీ వారు ఉంటున్న భవనం పైకి వెళ్లి సతీష్ కుమార్ దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మృతి చెందగా.. ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్షల నిమిత్తం తరలించారు. చేతికి అందివచ్చిన కుమారుడు బలవన్మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు విలపించారు. గుడివాడ రూరల్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870