हिन्दी | Epaper

Google Maps-Aadhaar: గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు

Aanusha
Google Maps-Aadhaar: గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు

Google Maps-Aadhaar: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సామాన్యుల కోసం మరో ముందడుగు వేసింది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌తో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత ఆధార్ కేంద్రాల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ప్రజలు తమకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్లను వెతకడం కోసం ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

Read Also: Divorce : గతేడాది ఇండియా లో ఎంతమంది విడాకులు తీసుకున్నారో తెలుసా ?

 Details of Aadhaar centers on Google Maps
Details of Aadhaar centers on Google Maps

సమీప కేంద్రాలను సులభంగా గుర్తించండి

ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఉపయోగించి ‘Aadhaar Seva Kendra’ అని సెర్చ్ చేయడం ద్వారా తమ ఇంటికి దగ్గరగా ఉన్న కేంద్రాలను చూడవచ్చు. ఈ మ్యాప్స్ ద్వారా ఆ కేంద్రం ఎక్కడుంది, అక్కడికి చేరుకునే దారి (Navigation), పనివేళలు వంటి పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ఈ సదుపాయం ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయనుంది.ఈ కేంద్రాలలో పెద్దలు, చిన్నారుల ఆధార్ నమోదుతో పాటు అడ్రస్, మొబైల్ నంబర్ అప్‌డేషన్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయని ఉడాయ్ తెలిపింది. ఈ సదుపాయం ఆధార్ సేవలను పొందడాన్ని మరింత సులభతరం చేస్తుంది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870