Andhra Pradesh: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఎసి) కె. శాంతి తన సుదీర్ఘ సస్పెన్షన్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు (AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన సస్పెన్షన్ను ఎత్తివేసి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్, ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 22 ప్రకారం నిర్ణయం తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను ఆదేశించారు.
Read Also: Andhra Pradesh: లస్కర్ల వ్యవస్థను చక్కదిద్దుతాం

నిబంధనల ఉల్లంఘనపై పిటిషనర్ వాదనలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి కారణం లేకుండా ఒక ఉద్యోగిని ఏడాదికి మించి సస్పెన్షన్లో కొనసాగించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తన వాదనలు వినిపించారు. తన సస్పెన్షన్ను నిరవదికంగా కొనసాగించాలని కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాల్ చేశారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసు కున్న న్యాయస్థానం, 2024 ఫిబ్రవరి 29న సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నంబరు 22ను అనుసరించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. విశాఖపట్నంలో భూ కుంభకోణాలతోపాటు ఉన్నతాధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిం చారన్న ఆరోపణలపై కె. శాంతి గతంలో సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వులతో ఆమె సస్పెన్షన్పై దేవదాయశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: