Tenali Fraud Case: తెనాలికి చెందిన ఒక మహిళకు మ్యాట్రిమోనియల్ సైట్(Matrimony fraud) ద్వారా ఒక యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికి, వివిధ అవసరాల నిమిత్తం విడతల వారీగా సుమారు 12.20 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే, ఆమె దగ్గర డబ్బులు అయిపోయి, ఇక ఇవ్వలేనని చెప్పడంతో నిందితుడి అసలు స్వరూపం బయటపడింది.
Read Also: AP Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

దాడి మరియు బెదిరింపులు:
డబ్బుల కోసం సదరు మహిళపై నిందితుడు దాడికి తెగబడటమే కాకుండా, తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పాత నేరస్థుడే:
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిపై గతంలోనే ఇలాంటి ఒక కేసు నమోదైనట్లు సమాచారం. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: