Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని కిస్త్వార్ జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ‘ఆపరేషన్ ట్రాషి-ఐ’ కింద CIF (D) వైట్ నైట్ కార్ప్స్, జమ్మూ–కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.
Read Also:Gadwal Crime News: మంగళవాయిద్యాలు మోగకముందే అనంతలోకానికి

ఆదివారం నుంచి కొనసాగుతున్న గాలింపు చర్యల సమయంలో ఉగ్రవాదుల కదలికలపై ఖచ్చితమైన సమాచారం అందడంతో బలగాలు ఆ ప్రాంతాన్ని ముట్టడించి ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు.
సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, స్థానిక ప్రజల రక్షణకు అదనపు బలగాలను మోహరించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో కిస్త్వార్ జిల్లాలో భద్రతా చర్యలను మరింత పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు గాలింపు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: