हिन्दी | Epaper

America: ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

Vanipushpa
America: ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

డొనాల్డ్ ట్రంప్(Trump) ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలతో పాటుగా పలు కంపెనీలు చెల్లించిన సుంకాల మాటేంటీ? దీనిపై కోర్టు కూడా తన తీర్పులో ఏమి స్పష్టం చేయలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుంకాలు (Trump Traiffs) పేరుతో గతేడాది నుంచి అమెరికా వసూలుచేసిన సొమ్మును తిరిగిచ్చేస్తారా? తిరిగిచ్చేస్తే భారత ఎగుమతిదారులకు రీఫండ్‌ ఏమైనా వస్తుందా? ఈ తీర్పుతో భారతీయ కంపెనీలకు (Indian Exporters) ఊరట లభించనుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. భారత్‌ సహా ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు చెల్లవని ప్రకటించిన తీర్పు వెలువడిన తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి రీఫండ్లపై నిలిచి ఉంది. ఫిబ్రవరి 20న వచ్చిన ఈ 6-3 తీర్పు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద తీసుకున్న ట్రంప్ నిర్ణయాలను రద్దు చేసింది.

Read Also: AI Impact Summit: ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

  America: Trump tariffs lifted.. Rs. 12 lakh crore refund
America: Trump tariffs lifted.. Rs. 12 lakh crore refund

మార్కెట్ నిపుణుల సూచన ప్రకారం..

గతేడాది ఏప్రిల్ 2 నుంచి డిసెంబర్ మధ్య వరకు అమెరికా ఖజానాకు సుమారు 13,300 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు) చేరాయి. అయితే, ఈ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం సరళం కాదు. అమెరికాలో టారిఫ్ చెల్లించినవారు దిగుమతిదారులు కాబట్టి, రీఫండ్ మొదట వారి ఖాతాల్లోకి వెళ్తుంది. భారత ఎగుమతిదారులు (Indian Exporters) నేరుగా లబ్ధి పొందరు. అయితే ఈ తీర్పుతో భారతీయ కంపెనీలకు తిరిగి అమెరికా మార్కెట్లో ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కొంతమేర, అమెరికాలో తమ ఉత్పత్తులను మళ్ళీ సరఫరా చేసే అవకాశం.. ధరల తగ్గింపు ద్వారా నష్టాలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. రీఫండ్‌ ప్రక్రియ కూడా అంత సులభం కాదు. ప్రస్తుతం అమెరికా వద్ద టారిఫ్ రీఫండ్‌లకు ప్రత్యేక ఆటోమేటిక్ వ్యవస్థ లేదు. కంపెనీలు దరఖాస్తులు చేసుకుని, కోర్టులు ఆమోదిస్తే, US Customs & Border Protection (CBP) వాటిని సమీక్షించి చెల్లింపులు ప్రారంభిస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం, ఇది 12 నుంచి18 నెలల వరకు సమయం పడవచ్చు.

ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టిన భారత సంతతి లాయర్

ట్రంప్ తానే గతంలో విలేకరులతో మాట్లాడుతూ రీఫండ్‌ వ్యాజ్యాలన్నీ పూర్తయ్యేవరకు రెండేళ్లు పడవచ్చని పేర్కొన్నారు. .. ఎవరీ నీల్ కత్యాల్.. కేసు ఎలా వాదించాడు.. ఇలాంటి పరిణామాలు గణనీయమైనవి. గతంలో కూడా 1990ల్లో హార్బర్ మెయింటెనెన్స్ ఫీజులు రాజ్యాంగవిరుద్ధమని కోర్టులు తీర్పు ఇచ్చి… రీఫండ్‌ల కోసం యూఎస్ కస్టమ్స్ ఒక ప్రత్యేక వ్యవస్థ రూపొందించారు. అయితే, ఇప్పటి పరిస్థితుల్లో, ఒకేసారి అంత పెద్ద మొత్తంలో రీఫండ్‌ చేయబడటం లేదు. కాబట్టి, భారతీయ ఎగుమతిదారులు ధైర్యంగా ఉండి, అమెరికా మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే కాస్ట్కో, రెవ్లాన్‌, బంబుల్‌ బీ ఫుడ్స్‌ వంటి కొన్ని కంపెనీలు దిగువ కోర్టుల వద్ద రీఫండ్ కోసం పిటిషన్లు దాఖలు చేసాయి. వీటి ఫలితాలపై మిగిలిన కంపెనీలు కూడా అనుసరించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే మృతి

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే మృతి

స్వీట్ కార్న్‌ను ఇలా తింటేనే పూర్తి ఆరోగ్యం..

స్వీట్ కార్న్‌ను ఇలా తింటేనే పూర్తి ఆరోగ్యం..

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

ఎన్నికల కౌంట్‌డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్

దేశంలో న‌క్స‌లిజం అంతం చేస్తాం: మంత్రి అమిత్ షా

దేశంలో న‌క్స‌లిజం అంతం చేస్తాం: మంత్రి అమిత్ షా

📢 For Advertisement Booking: 98481 12870