हिन्दी | Epaper

Delhi: ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

Vanipushpa
Delhi: ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా(LeT)(Lashkar-e-Taiba) కుట్ర పన్నింది. ఈ మేరకు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దిల్లీలోని ఎర్రకోట, చాందీనీ చౌక్ ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలే లక్ష్యంగా ఎల్​ఈటీ దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. చాందీనీ చౌక్ ప్రాంతంలోని ఒక దేవాలయంపై ఐఈడీతో దాడి చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహం పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Read Also: Gas Truck Blast : హైవేపై గ్యాస్ ట్యాంకర్ పేలుడు

Delhi: Is it a 'Lashkar' conspiracy to target temples?
Delhi: Is it a ‘Lashkar’ conspiracy to target temples?

లష్కరే ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాల హెచ్చరికలు

ఫిబ్రవరి 6న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా, భారత్‌లోని ప్రముఖ ధార్మిక స్థలాలపై దాడులు చేయాలని లష్కరే ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కేవలం దిల్లీలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మరోసారి ఎర్రకోట పరిసర ప్రాంతాలపై ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు రావడం దేశ రాజధానిలో కలకలం రేపుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870