हिन्दी | Epaper

Tirumala Summer rush: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Saritha
Tirumala Summer rush: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Tirumala Summer rush: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయి, క్యూలైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించాయి. 

Read Also: Chandrababu : ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గా చంద్రబాబే ఉండాల్సింది – భూమన ఎద్దేవా

Tirumala Summer rush: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
Tirumala Summer rush: Huge increase in devotees in Tirumala

వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లపై సమీక్ష 

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శనివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం ఒక్కరోజే 68,156 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 28,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లుగా నమోదైంది. గురువారంతో పోలిస్తే దర్శన సమయం 10-12 గంటల నుంచి ఒక్కసారిగా 20 గంటలకు చేరడం రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది. 

రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, దర్శన సమయాన్ని తగ్గించే లక్ష్యంతో టీటీడీ అదనపు ఈవో ఆధ్వర్యంలో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డేటా ఆధారిత వ్యూహంతో రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870