అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వివాదాస్పద సుంకాలపై అక్కడి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెనుక ఒక భారత సంతతి వ్యక్తి మేధస్సు, న్యాయ పోరాటం ఉండటం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది నీల్ కత్యాల్ (Neil Katyal) ఈ కేసులో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదించి విజయం సాధించారు. ట్రంప్ తన అధికారాలను ఉపయోగించి విదేశీ వస్తువులపై భారీ సుంకాలు విధించడాన్ని నీల్ కత్యాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. చిన్న వ్యాపారులు, డెమోక్రాట్ రాష్ట్రాల తరఫున ఆయన గట్టి వాదనలు వినిపించారు. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) ఉపయోగించి అన్ని దేశాలపై సుంకాలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు ఆయన వాదనలతో ఏకీభవిస్తూ, సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నీల్ కత్యాల్ స్పందిస్తూ.. “అధ్యక్షులు శక్తిమంతులే కావచ్చు, కానీ రాజ్యాంగం అంతకంటే శక్తిమంతమైనదని ఈ తీర్పు నిరూపించింది” అని హర్షం వ్యక్తం చేశారు.
Read Also: KA Paul Comments on CM Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కేఏ పాల్ హెచ్చరిక

ఇప్పటివరకు 50కి పైగా కేసులను వాదించిన అనుభవం
నీల్ కత్యాల్ అమెరికాలోని షికాగోలో జన్మించిన భారత సంతతి వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు భారత్ నుండి వలస వెళ్ళిన వారు. ప్రఖ్యాత ‘యేల్ లా స్కూల్’ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2010లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో అమెరికా సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. అమెరికా సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 50కి పైగా కేసులను వాదించిన అనుభవం ఆయనకు ఉంది. 2017లో ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా కూడా ఆయన కోర్టులో పోరాడారు. అంతేకాకుండా, ట్రంప్‌పై వచ్చిన అభిశంసన తీర్మానాలపై ‘ఇంపీచ్: ది కేస్ అగైనెస్ట్ డొనాల్డ్ ట్రంప్’ అనే పుస్తకాన్ని కూడా రచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: