हिन्दी | Epaper

Bangladesh: వీసా సేవల పునరుద్ధరణకు తారిఖ్ రహమాన్ కీలక నిర్ణయం

Vanipushpa
Bangladesh: వీసా సేవల పునరుద్ధరణకు తారిఖ్ రహమాన్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్(Tarique Rahman) ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య వీసాల జారీ రెండు నెలలక్రితం నిలిచిపోయింది. మూడు నెలల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగాయి.

Read Also: Bride cancels wedding for pet dog: పెంపుడు కుక్క కోసం పెళ్లి రద్దు

 Bangladesh: Tariq Rahman's key decision to restore visa services
Bangladesh: Tariq Rahman’s key decision to restore visa services

షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్

అలాగే ఇండియాలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో గత ఏడాది డిసెంబర్ నుంచి రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వీసాల జారీ ఆగిపోయింది. ఇటు ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో, అటు ఢాకాలోని భారత రాయబార కార్యాలయంలో వీసాల జారీ నిలిచిపోయింది. అయితే, తాజాగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తారిఖ్ రహమాన్ మూడు రోజుల్లోనే ఇండియాతో సంబంధాల విషయంలో సానుకూలంగా స్పందించాడు. వీసాలు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870