ఎన్ని చట్టాలు చేసినా, ఎంతమంది అధికారు లను నియమించినా, మరెన్నిసార్లు హెచ్చరిం చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎర్రచందనం తరలిపోతూనే ఉన్నది. పట్టుబడిన స్మగ్లర్లపై కేసు నమోదు చేస్తూనే ఉన్నారు. జైళ్లకు పంపుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాల్పులకు కూడా వెనుకాడడం లేదు. అయినా ఇవేమీ ఈ స్మగ్లింగును ఆపలేకపోతున్నాయి. అరుదైన ఎర్రచందనం (Red Sandalwood)వృక్షసంపదను కాపాడేందుకు ఏకంగా ప్రత్యేక టాక్సోఫోర్సును కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన అన్ని హంగులు కూడా కల్పించారు. ప్రాణా లకు తెగించి సిబ్బంది కూడా రాత్రింబవళ్లు శక్తిమేరకు కృషి చేస్తూనే ఉన్నారు. ఏకంగా పదుల సంఖ్యలోస్మగ్లర్లు టాక్స్ ఫోర్స్ సిబ్బంది చేతిలో గతంలో మరణిచినా ఏ మాత్రం వెరవడం లేదు. అప్పుడప్పుడు తాత్కాలికంగా ఆగినట్లు కన్పించినా ఏదో ఒక దారిలో కళ్లుగప్పి తరలి పోతూనే ఉన్నది. ఇటీవల దాడుల్లో బయటపడుతున్న ఎర్రచందనం దుంగలు, పట్టుబడుతున్న స్మగ్లర్లు ఈ విషయం చెప్పకనే చెబుతున్నాయి. గత రెండు, మూడు దశాబ్దాలుగా అత్యంత విలువైన ఈ వృక్ష సంపదను తర లిస్తూనే ఉన్నారు. అయితే కూలీ కోసం వచ్చి ఎర్రచందనం (Red Sandalwood) చెట్లను కూలగొడుతున్న తమిళనాడుకు చెందిన కూలీలే పట్టుబడుతున్నారు తప్ప వారి వెనుక ఉన్న పెద్దల హస్తం వెలుగు చూడడం లేదు. ఆయా ప్రాంతా ల్లో ఎవరిని అడిగినా ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ వెనుక పాత్ర ఎవరిది ఉందో కథలు కథలుగా చెప్తున్నారు. అయి నా పాలక పెద్దలు ఆవైపు దృష్టి సారించకుండా మూలా ల్లోకి వెళ్లకుండా ఈ అక్రమ స్మగ్లింగు నిరోధించేందుకు ప్రయత్నాలు చేయడం ప్రయోజనం లేకుండాపోతున్నది.
Read Also: Telangana: ఉద్యాన పంటలకు రాష్ట్ర సర్కార్ ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్లో కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా ల్లో మాత్రమే ఈ ఎర్రచందనం వృక్షాలు విస్తరించి ఉన్నా యి. వీటిని 1973లో అరుదైన వృక్షజాతుల జాబితాలో సైడ్స్ (కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎన్ డేంజర్డ్ స్పైస్సీ) లోకి చేర్చారు. దీనివల్ల ఎర్రచందనం దుంగల ఎగుమతిపై నిషేధం అమలులోకి వచ్చింది. కొన్ని ప్రాం తాల్లో పరిమితంగా ఉన్న ఈ వృక్షాలను రక్షించేందుకే వెసులుబాటు కల్పించారు. వాస్తవంగా చూస్తే ఇప్పటికీ ఈ ఎర్రచందనానికి మనదేశంలో పెద్దగా గిరాకీ లేదు. మార్కెట్ కూడా లేదనే చెప్పొచ్చు. కానీ చైనా, జపాన్ దేశాల్లో మాత్రం ఊహించని డిమాండ్ ఉంది. అంతకం తకు పెరుగుతుండడంతో కోట్లాది రూపాయల ఆదాయం వస్తుండడంతో ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు అక్రమం గా విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సముద్రాల ద్వారా సరిహద్దులు దాటించేందుకు ఎప్పటిక ప్పుడు కొత్త కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యవసాయోత్పత్తుల పేరుతో బోగస్ అనుమతులు కూడా పొందుతున్నారు. చెన్నై, ముంబయి, కొచ్చి తదితర రేవుల నుంచి సరుకు రవాణా ఓడల ద్వారా తరలిపోతున్నది. రోడ్డు మార్గాలను కూడా వదిలి పెట్టడం లేదు. ఢిల్లీ, చండిగడ్లోని గోదాముల్లో దాచిన సరుకును ఒక వ్యూహం ప్రకారం నేపాలకు తరలిస్తున్నా రు.అక్కడి నుంచి రవాణా చేస్తున్నారు. ఇదే కాదు మణిపూర్, మిజోరం రాష్ట్రాల నుంచి కూడా ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నది. అధికార వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఈ వృక్షాలు వెలుగొండ అడ వుల్లో మాత్రమే పెరగడానికి కారణాలు ఏవో ఇప్పటికీ మన శాస్త్రజ్ఞులు కనుక్కోలేకపోతు న్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా వృక్షశాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపు తున్నా తెలియడం లేదు. పదిహేడువందల సంవత్సరం లో బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఎర్రచందనం చెట్లకు దేశంలోని వివిధ ప్రాంతాలకు, తమ దేశాలకు కూడా తీసుకువెళ్లి పరీక్షలు జరిపారు. అక్కడ కూడా సత్ఫలితాలు ఇవ్వ లేదు. చెట్లు పెరగడం లేదు. పెరిగిన అందులో కావల సిన నాణ్యత లభించడం లేదు.

ఇక ఈ చెట్లకు ఇంత విలువ ఎందుకు వస్తున్నది? ఎందుకు ఉపయోగిస్తున్నా రన్నా విషయాల్లో ఇప్పటికీ స్పష్టత లేదు. సంగీత పరిక రాలకు, ఆటంబాంబుల కోసం జపాన్ వీటిని కొంటున్న దని ప్రచారం జరిగినా ఆ తర్వాత ఇది తప్పని తేలింది. అణుఇంధనం తయారీలోనూ, శంగార సామర్థ్యం పెంచే మందుల్లోనూ వీటిని వాడుతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. జపాన్ కానీ, చైనా కానీ వీటిని తాము ఎందుకు కొంటున్నాము? ఎందుకు ఉపయోగిస్తు న్నామనేది ఏమాత్రం బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బయోడైవర్సిటీ సంస్థ అధ్యయనం ప్రకారం ఒక టన్ను ఎర్రచందనం కోట్లల్లో ధర పలుకుతు న్నది. అందుకే రాయలసీమలోని మాఫియా ముఠాలు కొందరు ఫ్యాక్షన్ నేతలు, ఇంకొందరు రాజకీయ వాదులు ఎర్రచందనం స్మగ్లింగు తమ వ్యాపకంగా మార్చుకున్నా రు. దీనికితోడు అటవీ, పోలీసు శాఖ సిబ్బంది అధికా రుల్లో కొందరు స్మగ్లర్లతో కుమ్మక్కు అవుతున్నారు. చట్టా ల్లోని లొసుగులుకూడా స్మగర్ల పాలిట వరాలుగా మారు తున్నాయి. వారిపై పెట్టిన కేసులను తిరుగులేని సాక్ష్యా లతో రుజువు చేయడంలో కొందరు అధికారులు విఫలమవుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేం దుకు గతంలో ప్రత్యేకంగా తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేసిన టాక్సో ఫోర్స్ విభాగం రకరకాల సమస్యలతో కుదేలవుతున్నది. గతంలో ఇచ్చిన ప్రాధాన్యత పాలకులు నేడు అంతగా పట్టించుకోకపోవడం ఆ సిబ్బంది నిరుత్సా హంతో నీరసించిపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. అరుదైన ఈ వృక్షసంపదను సంరక్షించేందుకు త్రికరణశుద్ధిగా కృషి చేయాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: