हिन्दी | Epaper

Cancer Risk: ఊబకాయం క్యాన్సర్ ముప్పును పెంచుతుంది

Pooja
Cancer Risk: ఊబకాయం క్యాన్సర్ ముప్పును పెంచుతుంది

Cancer Risk: అధిక బరువు శరీరంలో దీర్ఘకాలిక వాపు, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి పరిస్థితులకు దారితీస్తూ క్యాన్సర్ ముప్పును పెంచుతుందని వారు చెబుతున్నారు. వైద్య నిపుణుల ప్రకారం అధిక కొవ్వు శరీరంలో హార్మోన్ల మార్పులు జరిగి కణాల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. దీంతో కొన్ని క్యాన్సర్ రకాల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా బ్రెస్ట్, కోలన్, లివర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లకు ఊబకాయం ప్రధాన కారణంగా మారుతోంది.

Read Also:Blood Pressure: యువతలోనూ బీపీ.. వైద్యుల షాకింగ్ నిజాలు

Cancer Risk

ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం, చక్కెర మరియు ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం, రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. అలాగే సరైన నిద్ర, ఒత్తిడి తగ్గించే చర్యలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీర బరువును నియంత్రించడం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870