हिन्दी | Epaper

Apple: పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

Vanipushpa
Apple: పాకిస్థాన్ కు ఐఫోన్లు పెట్టిన కండిషన్లు ఇవే!

దక్షిణాసియాలో టెక్నాలజీ హబ్‌గా ఎదగాలని చూస్తున్న పాకిస్థాన్ (Pakistan) తాజాగా అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్‌ను ఆకర్షించేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. భారత్, వియత్నాం వంటి దేశాల్లో ఆపిల్ సాధిస్తున్న విజయాన్ని చూసి, ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ఆపిల్ పెట్టిన మూడు ప్రధాన షరతులు పాకిస్థాన్‌లో అడుగుపెట్టేందుకు ఆపిల్ యాజమాన్యం కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. వాటిలో ప్రధానమైనవి.. ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం రాయితీ ధరలకు భూమిని కేటాయించాలి. 8% పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్: తయారీ ఆధారంగా ప్రభుత్వ ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని 8 శాతానికి పెంచాలి. పాత ఫోన్ల మరమ్మతులు: రెండు మూడు ఏళ్ల నాటి పాత ఐఫోన్లను రీఫర్బిష్ (Refurbish) చేసి తిరిగి ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ డిమాండ్లను పాకిస్థాన్ ఇంజనీరింగ్ డెవలప్‌మెంట్ బోర్డ్ (EDB) అంగీకరించింది.

Read Also: Republican Leader: అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

 Apple: These are the conditions imposed on iPhones for Pakistan!
Apple: These are the conditions imposed on iPhones for Pakistan!

షెహబాజ్ షరీఫ్ బీజింగ్‌లో ఒప్పందాలు

దీనివల్ల మొదటి ఏడాదిలోనే దాదాపు 100 మిలియన్ డాలర్ల విదేశీ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. శిక్షణతో మొదలై.. తయారీ వరకు! గతంలో ఆపిల్ సంస్థ ఇండోనేషియా, మలేషియా, భారత్‌లో కూడా ఇదే మోడల్‌ను అనుసరించింది. మొదట పాత ఫోన్ల మరమ్మతులు చేస్తూ స్థానిక కార్మికులకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత క్రమంగా కొత్త ఫోన్ల తయారీని ప్రారంభిస్తారు. పాకిస్థాన్ కూడా ఇదే ఫార్ములాను అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మొబైల్ తయారీదారులకు 6% ప్రోత్సాహకం ఇస్తుండగా, ఆపిల్ వంటి కంపెనీల కోసం దీనిని 8 శాతానికి పెంచుతున్నారు. భారీ పెట్టుబడులు.. స్థానిక విడిభాగాల వాటా కేవలం ఆపిల్ మాత్రమే కాకుండా, చైనా కంపెనీల నుంచి కూడా దాదాపు 557 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పాకిస్థాన్ ఆశిస్తోంది. దీనికోసం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే బీజింగ్‌లో ఒప్పందాలు చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870