हिन्दी | Epaper

Britain: ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ .. రాత్రికి విడుదల

Vanipushpa
Britain: ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ .. రాత్రికి విడుదల

బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన సంక్షోభంలో మునిగిపోతోంది. అమెరికాలోని అతిపెద్ద కుంభకోణమైన సెక్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 66 ఏళ్ల మాజీ యువరాజు ఆండ్రూను(Prince Andrew) పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆధునిక బ్రిటీష్ చరిత్రలో రాజకుటుంబానికి చెందిన ఒక ముఖ్య వ్యక్తిని ఇలా అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాగా అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం అరెస్ట్ అయిన ఈయన సాయంత్రానికి విడుదల కూడా అయ్యారు. గురువారం రోజు ఆండ్రూ 66వ పుట్టినరోజు. సరిగ్గా అదే రోజు ఉదయం 8 గంటలకు పోలీసులు సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆయన నివాసంపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన విండ్సర్ ప్యాలెస్‌లో గడిపిన ఆండ్రూ.. ఇప్పుడు పోలీసు కారు వెనుక సీట్లో దిక్కులు చూస్తూ కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ఆయన నివాసమే కాకుండా గతంలో ఆయన ఉన్న ‘రాయల్ లాడ్జ్’లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు.

Read Also: IAS Couple Wedding: సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

Former Prince Andrew arrested in the morning.. released at night
Former Prince Andrew arrested in the morning.. released at night

ఎప్‌స్టీన్‌తో పంచుకున్నట్లు ఈమెయిల్స్

అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైళ్లలో ఈయన పేరు కూడా ఉంది. ముఖ్యంగా ఆండ్రూ బ్రిటన్ వాణిజ్య రాయబారిగా ఉన్న సమయంలో.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు అత్యంత రహస్యమైన దౌత్య పత్రాలను పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2010లో ఆసియా దేశాల పర్యటనకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ నివేదికలను కూడా ఆయన ఎప్‌స్టీన్‌తో పంచుకున్నట్లు ఈమెయిల్స్ ద్వారా వెల్లడైంది. వీటితో పాటు వర్జీనియా గిఫ్రే అనే మహిళ.. తాను మైనర్‌గా ఉన్నప్పుడు ఆండ్రూ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. రాజు చార్లెస్ తన తమ్ముడిని ఇప్పటికే రాజ పదవుల నుంచి తొలగించారు. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ వరకూ వెళ్లడంతో.. రాజకుటుంబం దీనిపై పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870