Aishwarya Rajesh: ప్రముఖ నటి ఐశ్వర్య రాజేశ్, నటుడు విక్రాంత్ (Actor Vikrant) ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘అండర్ 18’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఆవిష్కరించడం విశేషం. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ పెరుమాల్‌సామి గతంలో వెట్రిమారన్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు. ఇళంగో కృష్ణన్, కార్తీక్ నేతా పాటలకు సాహిత్యం అందిస్తున్నారు.
Read Also: Yash Toxic Movie Update: యశ్ టాక్సిక్ మూవీ అప్‌డేట్

ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి. జగదీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మద్రాస్‌కారన్’ విజయం తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ‘అండర్ 18’ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఒక ఎమోషనల్ క్రైమ్ డ్రామా అని చిత్ర యూనిట్ తెలిపింది. నేరం కారణంగా ప్రభావితమైన ఒక కుటుంబం యొక్క భావోద్వేగాలను, క్రైమ్ ప్రపంచంలోని క్రూరమైన కోణాలను ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని అంతగా వెలుగులోకి రాని కొన్ని నేరాల నేపథ్యాన్ని దర్శకుడు ఈ కథ కోసం ఎంచుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో కిశోర్‌తో పాటు పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: