हिन्दी | Epaper

Supreme Court: ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

Vanipushpa
Supreme Court: ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

దేశంలో పెరుగుతున్న ఉచిత పథకాల సంస్కృతిపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసే విధంగా ఉచితాల పంపిణీ చేయడం సమంజసం కాదని వ్యాఖ్యనించింది. రాష్ట్రాలు ఉచితాలకంటే ఉపాధి అవకాశాల సృష్టిపై దృష్టి పెట్టాలని సూచించింది. రాష్ట్రాలు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్నీ ఉచితంగా పంచుకుంటూపోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా మిగలదని పేర్కొంది. ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌కు బదులు ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్‌ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

Read Also: Madhya Pradesh: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి

ఉచిత పథకాలు  దేశ ఆర్థికాభివృద్ధికి  దెబ్బ: సుప్రీంకోర్టు
 Supreme Court: Free schemes are a blow to the country's economic development: Supreme Court
Supreme Court: Free schemes are a blow to the country’s economic development: Supreme Court

ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ రూల్స్

ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ రూల్స్- 2024లోని రూల్ 23ను సవాలు చేస్తూ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం విచారించింది. తమిళనాడు ప్రభుత్వ తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రమణియం వాదనలు వినిపించారు. బిల్లు చెల్లించలేని పేదలకు సహాయం చేయడం అర్థవంతమైన చర్య అని, కానీ, కానీ ఆర్థిక స్థోమత ఉన్నవారికీ, లేనివారికీ తేడా లేకుండా ఉచితాలు ఇవ్వడం సరైందా? అంటూ సీజేఐ ప్రశ్నించారు. ఈ మేరకు తమిళనాడు విద్యుత్​ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రాలు అప్పుల్లో ఉండి కూడా డబ్బు పంపిణీ చేయడంపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులను సాగునీరు, విద్యుత్ వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులకు ఎందుకు కేటాయించకూడదని అడిగారు. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ (నగదు బదిలీ) విధానాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రజలు గౌరవంగా బతకడానికి మీరు ఉపాధి మార్గాలను సృష్టించాలి. ఉదయం లేచినప్పటి నుంచి ఉచిత ఆహారం, గ్యాస్, విద్యుత్ ఇస్తూ నేరుగా ఖాతాల్లోకి నగదు జమ చేస్తుంటే, ప్రజలు ఎందుకు పని చేస్తారు? ప్రతిదీ ఉచితంగా దొరుకుతున్నప్పుడు వారు ఏం పని చేస్తారు. మనం చేస్తున్నది దేశ నిర్మాణమేనా?’ అని సీజేఐ ప్రశ్నించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870