AP Budget: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసేలా ఉందని ఆయన ఆరోపించారు.
Read Also: ITDA: చింతూరు ఐటిడిఎ ముట్టడి

హామీల విస్మరణపై ధ్వజం
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని జగన్(YS Jagan) మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పడం ద్వారా ప్రభుత్వం వరుసగా వెన్నుపోటు పొడుస్తోందని ఆయన విమర్శించారు.
చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు
మోసానికి ప్రతిరూపంలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మోసానికి ఫ్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే అవుతారు” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం అంకెలను తారుమారు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: