हिन्दी | Epaper

Sundar Pichai on Vizag: ప్రపంచానికి గేట్ వేగా విశాఖపట్నం

Anusha
Sundar Pichai on Vizag: ప్రపంచానికి గేట్ వేగా విశాఖపట్నం

Sundar Pichai on Vizag: న్యూఢిల్లీలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్’ (AI Impact) సదస్సులో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ నగరం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, అతి త్వరలోనే ఈ నగరం ప్రపంచానికి ఒక ప్రధాన ‘గేట్ వే’గా మారుతుందని ఆయన కొనియాడారు. భారతీయ టెక్ రంగంలో వైజాగ్ కీలకం కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: POCSO: విశాఖలో ఘోరం: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

వేగవంతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నా

విశాఖలో 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్ అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్ మార్గానికి గేట్ వే అవుతుందని ఆయన తెలిపారు. భారత్-అమెరికా మధ్య ఏఐ అనుసంధానాన్ని పెంచేందుకు సముద్రగర్భంలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మార్గాలను వేయనున్నట్లు, వైజాగ్ డేటా సెంటర్ సింగపూర్, దక్షిణాఫ్రికా దేశాలతో అనుసంధానం అవుతుందని వెల్లడించారు.

Sundar Pichai on Vizag: Visakhapatnam as a gateway to the world
Sundar Pichai on Vizag: Visakhapatnam as a gateway to the world

భారత్ ఏఐ గ్లోబల్ చాంపియన్ గా ఆవిర్భవిస్తుందని, తదుపరి ఏఐ దిగ్గజం భారత్ నుంచే పుట్టుకొచ్చే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాను భారతదేశంలో సందర్శించిన ప్రతిసారి, వేగవంతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నానని సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. తన తాజా భారత సందర్శన కూడా అందుకు భిన్నమేమీ కాదని, భారత్‌లో మార్పుల వేగం చూస్తున్నానని అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఐఐటీ ఖరగ్‌‌పూర్‌కు విశాఖపట్నం మీదుగా వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870