AP: ఇంద్రకీలాద్రి (Indrakeeladri) శ్రీ దుర్గా ఈ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని శ్రీ మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో రాత్రి 7 గంటలకు ద్వాదశి ప్రదక్షిణలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ఈవో రామచంద్ర సీనా నాయక్ దంపతులు పాలకమండలి సభ్యులు శ్రీ ఆవారు శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి, శ్రీమతి సరోజిని పద్మశేఖర్, మరియు శ్రీమతి సరిత తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా ఇఓ మాట్లాడుతూ ఈ సేవ మూడు రోజుల పాటు ఏకాంత సేవగా అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
Read Also: CM CBN: నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

సింగపూర్ నివాసులైన శ్రీ విపిన్ కుమార్ మరియు వారి ధర్మపత్ని శ్రీమతి ప్రవీణ్ కుమారి గారు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి నిత్య అన్నదాన పథకం కోసం రూ.1లక్ష, గుంటూరు జిల్లా, ఈస్ట్ అమరావతి రోడ్డు, గోరంట్లకు చెందిన మేడి కొండూరు కృష్ణమూర్తి, ఉమామహేశ్వరి దంపతులు శ్రీ అమ్మవారి అన్న ప్రసాదం నిమిత్తం రూ.1,00,001ల విరాళాన్ని అప్పగించారు. ఈనెల 21వ తేదీ (శనివారం) నిర్వహించనున్నారు. ఉదయం 8:00 గంటలకు మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో లెక్కింపు నిర్వహిస్తామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ పౌర్ణమి రోజున అనగా ది.03.03.2026, మంగళవారం మధ్యాహ్నం కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము సందర్భముగా దేవస్థాన వైదిక కమిటీ వారి సూచనల మేరకు ఆగమ శాస్త్ర ప్రకారము ఉదయం గం. 10గంటలకు శ్రీ అమ్మవారి ప్రధానాలయం, ఇతర ఉపాలయముల కవాట బంధనము చేస్తామని, తిరిగి ది.04.03.2026, బుధవారము తెల్లవారుఝామున గం. 03-00 ని.లకు శ్రీ అమ్మవారి ప్రధానాలయము మరియు ఉప ఆలయముల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకములు నిర్వహించిన అనంతరం అర్చన, మహానివేదన, హారతి నిర్వర్తింప చేసిన తదుపరి ఉదయం గం. 08గం.లకు భక్తులకు దర్శనము కల్పించబడునని తెలియజేయడమైనది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: