Nissan gravite : భారత ఆటోమొబైల్ మార్కెట్లో నిస్సాన్ ఇండియా తన కొత్త కాంపాక్ట్ ఎంపీవీ ‘నిస్సాన్ గ్రావిటే’ ను విడుదల చేసింది. 7 సీటర్ విభాగంలో అత్యంత చవకైన ఫ్యామిలీ కారుగా ఇది గుర్తింపు పొందుతోంది. పరిచయ ఆఫర్‌గా ప్రారంభ ధరను రూ.5.65 లక్షలుగా నిర్ణయించగా, ఈ ధర మొదటి 5,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
Read Also: Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

ఈ కారు 1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తూ 72 bhp పవర్, 96 Nm టార్క్ అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ (Nissan gravite) మరియు AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి. మైలేజ్ పరంగా AMT వేరియంట్ 19.6 kmpl వరకు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. డిజైన్ పరంగా హెక్సాగన్ గ్రిల్, మస్క్యులర్ లుక్ ఆకట్టుకుంటాయి. భద్రత కోసం అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, TPMS, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌లో విశాలమైన 7 సీటర్ ఫ్యామిలీ కారును కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలవనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: