ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య నలభైకి పైగా ఉంది. కానీ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో కనిపిస్తున్న ఫలితం మాత్రం నామమాత్రం. ఒకప్పుడు హక్కుల కోసం పోరాడిన సంఘాలు, నేడు సభ్యత్వాలు, ఫండ్లు, ఈవెంట్లు, సన్మానాల చుట్టూ తిరిగే సంస్థలుగా మారాయన్న విమర్శ ఉపాధ్యాయ వర్గం నుంచే వినిపి స్తోంది. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు సుమారు లక్షన్నర మంది మాత్రమే ఉంటే, నాలుగు పెద్ద సంఘాల్లో ప్రతి సంఘం సభ్యత్వం (Memberships)లక్ష దాటిపోతుండటం ఆశ్చర్యకరం. అన్ని సంఘాల సభ్యత్వాలను (Memberships) కలిపితేఐదు లక్షలు దాటుతున్నాయి. ఇది గణాంకాల వింత మాత్రమే కాదు వ్యవస్థ లోపానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ పరిస్థితిలో ఉపా ధ్యాయులకు ఏ ఒక్క సంఘంతోనూ నిజమైన అనుబంధం ఉండటం లేదు. సభ్యత్వం ఉంది కానీ ఉద్యమ స్పూర్తి లేదు. అందుకే ఆధార్ నెంబర్ లింక్ చేసి ఒక ఉపాధ్యా యుడు – ఒక సంఘం” విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసూల్స్-1962 అమలే ప్రజాస్వామ్యానికి పునాది. ఈరూల్ ప్రకారం, కనీసం 25 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్నప్పుడే ఏ సంఘానికైనా గుర్తింపు ఇవ్వాలి. కానీ ఈ నిబంధన నేటి పరిస్థితుల్లో పూర్తిగా విస్మరించబడుతోంది. ఈ రూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించి, ఎన్నికల ఆధారంగానే ప్రభుత్వం
గుర్తింపు ఇవ్వాలి. అప్పుడు ఆ ఎన్నికల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన సంఘాలకు మాత్రమే సభ్యత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగిలిన సంఘాలను రిజిస్ట్రేటేడ్అసోసియేన్గా మాత్రమే పరిగణించాలి. సభ్యత్వమే ప్రాతినిధ్యానికి సూచిక అన్నట్టు వ్యవహారం నడుస్తున్నప్పుడు, ఎన్నికలలో ప్రజాస్వామ్యం ఎక్కడ? నాయకత్వం దశాబ్దాల తరబడి పాతుకుపోయి, సంఘాలు వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి.
Read Also : http://AmritBharat Train: అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం

నిబంధనలకు పూర్తిగా విరుద్ధం
ఏ ఉపాధ్యా య సంఘంలోనూ దళిత వర్గాల వారిని రాష్ట్ర స్థాయి ప్రధాన నాయకత్వంలోకి ఎదగనివ్వకపోవడం ఒక చేదు నిజం. జిల్లాల స్థాయిలోనూ ఇదే దుస్థితి కొనసాగుతోంది. ఈ నిరాకరణ వల్లే, తమ సంక్షేమం కోసం దళిత వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు కుల సూచిక నామాలతో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి 1962 నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే ఆ నిబంధనలు స్పష్టంగా కులం, మతం, తెగ ఆధారంగా సంఘాలు ఏర్పడకూడదు అని చెబుతున్నాయి. కుల సంఘాల ఉద్భవానికి కారణం ఉపాధ్యాయులే కాదు ప్రధాన సంఘాల్లో ప్రజా స్వామ్య నాయ కత్వం లేకపోవ డమే. చాలా సంఘాల్లో ఎన్నికలకు కోరమ ఉండదు. ఇది ఆత్మపరిశీ లన చేయాల్సిన అంశం. సభ్యత్వ ఫీజులు, జనరల్ ఫండ్, బిల్డింగ్ ఫండ్, వార్షిక సభలు, రాష్ట్రస్థాయి ఈవెంట్లు ఇవన్నీ నిర్వహణకు చూపే ఉత్సాహం, ఉపాధ్యాయుల మౌలిక సమస్యలపై కనిపించడం లేదు. సన్మానాలు, సత్కారాలు, ప్రశంసాపత్రాలకు నాయ కత్వం అలవాటు పడిపోయింది. సాధారణ ఉపాధ్యాయుడు సోషల్ మీడియా మాయలో ఉన్నాడు. ఉద్యమాల స్థానంలో ప్లెక్సీలు, వేదికలు, ఫోటోలు మాత్రమే మిగులుతున్నాయి.
స్వీయ బాధ్యత
పంచాయితీ రాజ్ ఉపాధ్యాయులకు అమలులోఉన్న చట్టాలు వేరుగా ఉండగా, గవర్నమెంట్ టీచర్లతో యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ చట్టబద్ధంగా సాధ్యం కాదన్న నిజాన్ని సంఘాలు ఉపాధ్యాయులకు చెప్పడం లేదు. అసలు రూల్స్ వస్తే వచ్చే ప్రమోషన్‌తో ప్రయోజనం ఒక ఇంక్రిమెంట్ మాత్రమే. వాటి వల్ల వచ్చే ప్రమోషన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 500 దాటక పోవచ్చు. ఒక ఇంక్రిమెంట్ విలువ జీతంలో సుమారు 2.5 శాతం మాత్రమే ఉంటుంది. కానీ ఒక డీఏ పెరుగుదలే 3 శాతానికి మించి ఉంటుంది. ఈ వాస్తవాలను గురించి ఆలోచించే నిజాయితీ సంఘాలకు కనిపించడం లేదు.స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్-డిగా ప్రమోషన్ పొందిన కొందరు, మహిళా ఉపాధ్యాయులకు కనీసం చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు. కార్యాలయ పనికి అంతరాయం కలగకుండా ఉంటుందని భావించినప్పుడే సెలవు ఇవ్వాలనే నిబంధనను కుంటిసాకుగా చూపి మహిళా టీచర్లకు నరకం చూపిస్తున్నారు. సంవత్సరం పొడుగునా బోధన, పరీక్షలు, ఆన్లైన్లో మార్కుల అప్లోడ్ ఉండే స్కూల్స్ లో పనికి అంతరాయం లేకుండా ఎలాసాధ్యం. పై అధికా రులకు తెలియజేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవలసిన వాస్త వాన్ని ప్రధానో పాధ్యాయులు విస్మరిస్తున్నారు. ఇలాంటి వారు రేపు ఉన్నతాధికారులుగా ప్రమోషన్లు పొందితే, సాధారణ ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎంతవరకు కృషి చేస్తార న్నది సమాధానం లేని ప్రశ్నగా మిగులుతోంది. ఇన్కమ్ ట్యాక్స్ ఈఫైలింగ్, పిపిఎఫ్, ఎపిజిఎల్, జిఐఎస్ లోన్లు, ఎసిఎస్ పార్టియల్ విత్రాయల్స్ ఇవి ఉపాధ్యాయుల వ్యక్తి గత పనులు, బాధ్యతలు. వాటికి సహాయం చేయడాన్నే సంఘాలు గొప్పసేవగా ప్రచారం చేసుకోవడం వల్ల, ఉపా ధ్యాయుల్లో స్వీయ బాధ్యత తగ్గిపోతోంది. ఉపాధ్యాయ సంఘాల్లో పెరుగుతున్న కుల భావన ఉపాధ్యాయ వృత్తి గౌరవానికి, విద్యా వ్యవస్థకు ప్రమాదకరం. ఉపాధ్యాయుడు సమాజానికి మార్గదర్శకుడవ్వాల్సిన స్థితిలో, కుల సమీకర ణాల బందీగా మారడం ఆలోచనీయకురిణామం. ఉపాధ్యాయ సంఘాలు ఆత్మపరిశీలన చేసుకోకపోతే, అవి ఉపాధ్యా య సంక్షేమానికి కాకుండా కేవలం సంఘ సంస్కృతికే పరిమి తమవుతాయి.1962 నిబంధనల ప్రకారం ఎన్నికలు, కనీసం 25 మంది సభ్యత్వం లేకుండా గుర్తింపు వద్దు, ఒక ఉపాధ్యాయుడు – ఒక సంఘం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కు పరిమిత గుర్తింపు, ప్రజాస్వామ్య, సమానత్వ నాయకత్వం ఇవే ఉపాధ్యాయ ఉద్యమాన్ని మళ్లీ సరైన దారిలో నడిపించగల మార్గాలు. లేకపోతే సంఘాల సంఖ్య పెరుగుతుంది. సమస్యలు మాత్రం అలాగే మిగులుతాయి.
-నల్ల రవి కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: