Sunitha: గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగిని సునీతను మాజీ భర్త మహేశ్ హత్య చేశాడు. హైదరాబాద్ (Hyderabad) వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో ఓ ఆపార్టుమెంట్లో ఉంటున్న సునీతకి గతంలో మహేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. మనస్పర్థలు రావడంతో ఇరువురు విడిపోయారు. సునీత ఏడాది క్రితం అతడికి విడాకులు ఇచ్చి, మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది.
Read Also: Jagtial: రీల్స్ కోసం యువకుడి పిచ్చి చేష్టలు

దీంతో మహేశ్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమె ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో చొరబడి ఆమెను కత్తితో నరికి, అనంతరం పూల కుండీతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని బెదిరించాడు. ఘటన అనంతరం మహేశ్ పారిపోతుండటం గమనించిన అపార్టుమెంట్ వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: