Blinkit case: ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్లింకిట్ ద్వారా కొనుగోలు చేసిన కత్తులు రెండు వేర్వేరు హత్య కేసుల్లో ఉపయోగించబడ్డాయన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, ఈ సంస్థపై కేసు నమోదు చేశారు.. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను కేవలం డెలివరీ చేసినందుకు కూడా కేసు నమోదు చేయవచ్చా? అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Anantapur Crime: డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య
ఆయుధ చట్ట ఉల్లంఘన కింద కేసు నమోదు
నిబంధనల ప్రకారం 7.62 సెంటీమీటర్ల పొడవు, 1.72 సెంటీమీటర్ల వెడల్పు గల బ్లేడ్లు ఉన్న (Online Knife Sale Rules) విక్రయించాలి. కానీ ఈ హత్య కేసుల్లో నిందితులు ఉపయోగించిన చాకులు 8 సెంటిమీటర్ల పొడవు 2.5 సెంటిమీటర్ల వెడల్పుతో ఉన్నాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించకుండా బ్లింకిట్ వీటిని విక్రయించిందని ఆయుధ చట్ట ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బ్లింకిట్ స్టోర్లపై రెయిడ్స్ నిర్వహించి 55 కు పైగా చాకులను స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: