हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

North Korea: నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కు సోదరి నుంచి సవాళ్లు..

Vanipushpa
North Korea: నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కు సోదరి నుంచి సవాళ్లు..

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(kim jong un) కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అధికార పగ్గాల కోసం కిమ్‌ సోదరి, కూతురు పోటీ పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కిమ్ రాజకీయ వారసురాలిగా తన కూతురు కిమ్‌ జు యేను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు దక్షిణ కొరియా(north-korea) నిఘా సంస్థ అయిన నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (NIS) వెల్లడించింది. కుమార్తెకు అధికార బాధ్యతలు ఇస్తే కిమ్‌ జోంగ్‌కు సోదరి నుంచి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫిబ్రవరి చివర్లో ఓ సదస్సు జరగనుంది. ఆ సదస్సులో కిమ్ జోంగ్ ఉన్ తన రాజకీయ వారసత్వ ప్లాన్‌ను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. 2022లో కిమ్‌ జు యే మొదటిసారిగా ప్రపంచానికి కనిపించింది. అనంతరం ఆయుధ పరీక్షలు, సైనిక కవాతులు లాంటి వివిధ అధికారిక కార్యక్రమాల్లో తండ్రితో పాటు పాల్గొంది. సాధారణంగా ఉత్తర కొరియాలో పురుషుల నాయకత్వాన్నే పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ అదే జరిగితే కిమ్ కూతురికి వారసత్వ బాధ్యతలు తగ్గే అవకాశం ఉంది.

Read Also: Breaking News: ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

North Korea: నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు..సోదరి నుంచి సవాళ్లు
North Korea: నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు..సోదరి నుంచి సవాళ్లు

“సక్సెసర్ నామినేట్” చేసే ప్రక్రియ మొదలు

గతేడాది సెప్టెంబర్ కిమ్ జు యే తండ్రితో కలిసి చైనా పర్యటన వెళ్లింది. అప్పుడే ఆమెపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. కిమ్‌కు రాజకీయ వారసురాలు ఆమెనే అనే అంచనాలు అప్పటినుంచే మొదలయ్యాయి. కానీ వారసత్వాన్ని కూతురుకి ఇస్తే కిమ్ సోదరి కిమ్ యో జోంగ్‌తో ప్రతిఘటనలు జరిగే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కిమ్ జు ఏ వయస్సు సుమారు 13 ఏళ్లు మాత్రమే. ఆమెకు ఇంకా ఎలాంటి రాజకీయ పదవి లేదు. దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) సమాచారం ప్రకారం మాత్రం ఫిబ్రవరిలో ఆమెను “సక్సెసర్ నామినేట్” (వారసురాలిగా నామినేట్) చేసే ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. అంతేకాదు అక్కడి అధికారిక మీడియా కూడా ఆమెను ‘గౌరవనీయమైన కుమార్తె’, ‘గొప్ప మార్గదర్శకురాలు’ అంటూ సంభోదిస్తుంది. సైనిక జనరల్స్ కూడా ఆమె ముందు మోకరిల్లారు. దీంతో ఆమెనే భవిష్యత్తు నాయకురాలని తెలుస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ (38) ఉత్తర కొరియాలో ప్రస్తుతం అత్యంత శక్తిమంతమైన నాయకురాలిగా ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870