Telangana CM : సచివాలయంలో నిర్వహించిన పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ సమీక్ష సమావేశంలో అధికారులకు ఆయన కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండి పారిశుద్ధ్యం, రోడ్ల శుభ్రత, ప్రజా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే బాధ్యులపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. నగరాభివృద్ధికి సంబంధించి స్మార్ట్ పోల్స్ ఏర్పాటు, ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిల నిర్మాణం, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని చెప్పారు.
Read also: Government Jobs India: ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు

అడ్వర్టైజింగ్ బోర్డుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. అనధికార బోర్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు 10 శాతం బోర్డులు కేటాయించాలని సూచించారు. అలాగే బోర్డుల నుంచి వార్షిక ఫీజు వసూలు చేయాలని, రాష్ట్రంలోని అన్ని పార్కుల వివరాలను సేకరించాలని అధికారులకు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: