ఆం ధ్రప్రదేశ్కు సంబంధించిన 2026-27 ఆర్థిక బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవులు 14.2.26న శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయలు. ఇది గతబడ్జెట్ కన్నా 9,856 కోట్లు ఎక్కువ. రెవిన్యూ వ్యయం 2,56,143కోట్లు. మూలధనం 53,915కోట్లు. రెవిన్యూలోటు 22,002 కోట్లు కాగా ద్రవ్య లోటు 75, 868కోట్లు. బడ్జెట్ లెక్కలు గమనిస్తే వివిధ రంగా లకు కేటాయించిన దానికోసం పెద్దమొత్తంలో అప్పులు చేయాలి. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరింత అప్పుల ఊబిలో కూరుకు పోతుంది. గతబడ్జెట్లో అప్పులకు వడ్డీల కింద 24,430 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వ ఖర్చులలో 18 శాతం వరకు వడ్డీలు, అసలు చెల్లింపులకే సరిపోతుందని ది హిందు తెలిపింది. ఈ లెక్కన అప్పులకు వడ్డీలచెల్లింపులు ఈ ఆర్థికసంవత్సరంలో మరింత పెరుగుతాయి. నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో, గత బడ్జెట్ వివిధ రంగాలకు కేటా యించిన మొత్తంలో ఎంత ఖర్చుపెట్టారు, ఎంతవరకు పని జరిగింది? ఇంకా ఎంతపని మిగిలి ఉంది? పూర్తిగా పని జరగకపోవటానికి కారణాలు వివరించి అందుకు నూతన బడ్జెట్లో నిధులు కేటాయించి ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియచేయాలి. కాని 2026-౨౭ బడ్జెట్లో అలాంటి ప్రస్తావనే లేదు. బడ్జెట్ మొత్తం అంకెల గారడీగా ఉంది. బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయింపులు గమనిస్తే వ్యవసాయరంగానికి రైతులకు ఇచ్చే చాయితీలను గణనీయంగా తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి (agricultural)రూ.48,341.14 కోట్లు కేటాయించగా, ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రూ.11,745.21 కోట్లు మాత్రమే కేటాయింపు జరిగింది. అంటే వ్యవసాయరంగానికి గణ నీయంగా కేటాయింపులు తగ్గాయి. గతబడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,903 కోట్లు కేటాయించగా, ఈఆర్థిక బడ్జెట్లో రూ. 9,906 కోట్లు కేటాయించారు. ఒకవైపున మూడు వేలకోట్ల దాకా కేటాయింపులు తగ్గించగా, బడ్జెట్ ప్రసంగాల్లో మాత్రం ఆర్థికమంత్రి సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
Read Also : http://RBI Kisan Credit Card update: కిసాన్ క్రెడిట్ కార్డ్‌లో ఆర్బీఐ కీలక మార్పులు

ఖర్చులు పెరగటం
రైతాంగ సేద్యం తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రతిసంవత్సరం సేద్యపు ఖర్చులు పెరగటం, అందుకు అనుగుణంగా పంట లకు మద్దతు ధరలు లేకపోవడం, ప్రైవేట్ వ్యాపారుల చోపిడీ, ప్రభుత్వమే న్యాయమైన ధరకు పంటలు కొనుగోళ్లు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతులు పంటలకు సరైన ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ నేపథ్యంలో ఆనాటి వైసీపీప్రభుత్వ ముందస్తు పంటపెట్టుబడిని మూడు ధపాలుగా 13,500 రూపాయలు ప్రకటించింది. ఇందులో కేంద్రప్రభుత్వం ఇచ్చే ఆరువేల రూపాయలు కలిసిఉన్నాయి. చంద్రబాబు నాయ కత్వాన ఉన్నకూటమి ప్రభుత్వం ముందస్తు పెట్టుబడి రూ. 20వేలుగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పెట్టుబడి సహాయం ఇవ్వలేదు. ఆ తర్వాత సంవత్సరంలో కూడా ఇప్పటికి రెండుసార్లు మాత్రమే ఇచ్చింది. చాలామంది రైతులు పథకానికి దూరమయ్యారు. ఈ పథకం ఖర్చు తగ్గించుకోవడానికి అర్హతపేరుతో కొందరి రైతులను పథకం నుంచి తప్పించడానికి చంద్రబాబు ప్రభు త్వం పూనుకుంది. గతబడ్జెట్లో ముందస్తు పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ పథకానికి రూ.9,400 కోట్లు కేటాయిం చిన ప్రభుత్వం, ఈ ఆర్థికసంవత్సరం బడ్జెట్లో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించింది. ఫలితంగా చాలామంది రైతులు పథకానికి దూరము అవుతారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అలాంటి పరి స్థితుల్లో పంటలు కొనుగోళ్లు చేసి తమను ఆదుకోవాలని రైతులు ఆందోళన చేసిన ఫలితంగా పంటల బీమాకుథకం ప్రవేశపెట్టి రైతులకు పరిహారం అందిస్తామని పాలకులు చెప్పారు. ప్రస్తుతం పంటల బీమా ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉండగా, గతసంవత్సరం చంద్ర బాబు ప్రభుత్వ బడ్జెట్లో మాత్రం 1,023 కోట్లు కేటాయిం చినా ప్రీమియం చెల్లింపులు మాత్రంచేయలేదు. ఫలితంగా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు బీమా పరిహారానికి దూరమయ్యారు. ఈ సంవత్సరంబడ్జెట్లో 250 కోట్లు మా త్రమే కేటాయించింది. ఈ కేటాయింపులు గమనిస్తే, రాష్ట్రంలో పంటల బీమాపథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయ చూస్తుంది అనే అభిప్రాయం ఏర్పడుతున్నది.

అప్పుల ఊబిలో
సేద్యపు ఖర్చులు పెరగడం, పంటలకు న్యాయమైన ధరలు లభించక పోవడం, కుంటలు అమ్ముడుకాని పరిస్థితుల వల్ల రైతాంగం నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అనేకమంది రైతులు బలవన్మరణాల పాలయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగం బహిరంగ మార్కెట్లో పంటల ధరలు పడి పోయినప్పుడు న్యాయమైన గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వ మే పంటలు కొనుగోళ్లు చేయాలని ఆందోళన చేసిన ఫలి తంగా అందుకోసం ధరలస్థిరీకరణ నిధిని ఆనాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి మూడు వేలకోట్లు కేటాయించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత బడ్జెట్లో 300 కోట్లు మాత్రమే కేటాయించడంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ ఆర్థికసంవత్సరం బడ్జెట్లో 500 కోట్లు కేటాయించి, కేటాయింపులు పెంచినట్లు చెప్పింది. ఈ నామమాత్రపు కేటాయింపు పెంపువల్ల రైతులకు ప్రయోజ నం లేదు. ధరల స్థిరీకరణనిధి ద్వారా కూటమి ప్రభుత్వం పంటల కొనుగోళ్లు చేయలేదు. పంటలకు న్యాయబద్ధమైన మద్దతు ధరగ్యారంటీ ఇవ్వడంలేదు. రైతాంగానికి సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తామని, కౌలు రైతులకు కూడా దాన్ని వర్తింప చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆచర ణలో విఫలమైంది. ఈబడ్జెట్లో సున్నా వడ్డీ రుణాల ప్రస్తా వనగాని, కౌలురైతుల ప్రస్తావన ఎక్కడాకన్పించదు. రైతాం గాన్ని ఆదుకునే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయని కూటమి ప్రభుత్వం, అవసరానికి మించిన వ్యవసాయ (agricultural)త్రీ కరణ, లాభసాటి పంటల సాగు గురించి గొప్పలు చెప్పింది. ప్రకృతి వ్యవసాయమే రైతుల సమస్యలకు పరిష్కారంఅన్న విధంగా బడ్జెట్ ప్రసంగంలో మంత్రిమాటలు ఉన్నాయి. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాద నలను వ్యతిరేకిస్తూ, స్వామినాథన్ సిఫార్సులకు అనుగు ణంగా పంటలకు మద్దతుధరలు ప్రకటించి వాటికి చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించడమే రాష్ట్ర రైతాంగం తక్షణ కర్తవ్యం.
-బొల్లిముంతసాంబశివరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: