కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డివిఎస్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థి కోట్రేష్ (16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం హాస్టల్ భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో పడిపోయిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు.
Read also: Hyderabad gold rate : బంగారం భారీగా తగ్గింది, వెండి ఒక్కరోజులో భారీ పతనం
తండ్రి ఆరోపణలు
మృతుడి తండ్రి పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపల్ వేధింపుల కారణంగానే తన కుమారుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ముందే ఫిర్యాదు చేసినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణ కొనసాగుతోంది
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులపై మానసిక ఒత్తిడి, వేధింపుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ అనంతరం అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: