విజయవాడ : Andhra Pradesh: తిరుపతి జిల్లా చెర్లోపల్లి గ్రామానికి చెందిన కె. నిరోషా సోమవారం టిడిపి (TDP) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు ఆర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ తమ గ్రామంలో సర్వే నెం. 120/5లో ఉన్న తమ భూమిని స్థానిక వైసిపి నేతలు కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే సర్వే నెం. 201/2 భూమిపై కోర్టులో కేసు నడుస్తుండగానే నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యక్తులు ఆన్లైన్లో తమ పేర్ల మీద నమోదు చేసుకున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు. దీంతో పాటు తమ పూర్వీకుల నుండి సంక్రమించిన సర్వే నెం. 162/1, 162/4ఎ భూములకు సంబంధించి ‘నోషన్ ఖాతా’ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై గతంలో ఆర్టీఓకి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు మంత్రి సవిత, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, బెస్త సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్లకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.
Read Also: YS Jagan DA Case: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

కూలీ దాడులు, అక్రమ రిజిస్ట్రేషన్లు, లీజు ఘోరాలు
చిత్తూరు జిల్లా జీదీ నెల్లూరు మండలం జుపల్లి గ్రామానికి చెందిన ధర్మారెడ్డి గ్రీవెన్స్లో ఆర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తాను తెలుగుదేశం పార్టీ తరపున ఎంపిటిసి, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చినా లొంగకపోవడంతో మాజీ మంత్రి నారాయణ స్వామి కక్షపూరితంగా వ్యవహరించి తన సొంత భూమిని ఆక్రమించారు. సర్వే నెంబర్ 1314 లో గల 3.98 ఎకరాల భూమి తన తల్లి సిద్ధమ్మ పేరు మీద 2000 సంవత్సరంలో మంజూరు చేయబడింది. ఎన్నో ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న ఈ భూమిని అక్రమంగా లాక్కుని పట్టాలు పంపిణీ చేశారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
ఆర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కోటకొండ గ్రామానికి చెందిన మండ్ల కాశమ్మ గ్రీవెన్స్ లో ఆర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామ పరిధిలోని సర్వే నెం. 2857దిలో తమకు 3.00 ఎకరాల భూమి కలదు. దీనికి సంబంధించి పట్టాదారు పాస్ బుక్, 1తీ, అడంగల్, ఆన్లైన్ రికార్డులన్నీ తన పేరుపైనే ఉన్నాయి. అదే సర్వే నంబర్లో పక్కనే 2 ఎకరాల భూమి ఉన్న కల్లకుంట్ల బాలరాజు అనే వ్యక్తి తమకు చెందిన సుమారు 1.60 ఎకరాల భూమిని గత మూడు సంవత్సరాలుగా దౌర్జన్యంగా ఆక్రమించి సాగు చేస్తున్నాడు. భూమి గురించి అడిగితే తను ఎస్సీ కులానికి చెందినవాడినని, ఎదురు తిరిగితే అక్రమ కేసులు పెడతానని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. తాము సాగు చేసిన వంటను నాశనం చేయడమే కాకుండా పొలంలోని నీటి పైపులను కూడా తగులబెట్టారు. ఈ విషయంపై పలుమార్లు సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
చంపుతామని బెదిరిస్తూ
కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గోడెం అనుమాయమ్మ గ్రీవెన్స్ లో ఆర్జీ ఇచ్చి ఆర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం. 322/1, 322/2, 589/1లలో మొత్తం 1.19 ఎకరాల భూమి కలదు. ఈ భూమిలోకి వెళ్లడా నికి సర్వే నెం. 322/3 (0.14 సెంట్లు) గుండా వారి ఉంది. పక్క పొలం వారైన గోడెం వేణు వారి కుటుంబ సభ్యులు, తమను పాలంలోకి వెళ్లకుం డా దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు. అడిగితే చంపుతామని బెదిరిస్తూ దుర్భాషలాడుతున్నారు. గతంలో సర్వే కోసం దరఖాస్తు చేసుకోగా, గన్న వరం మండల సర్వేయర్ వచ్చి భూమిని కొలవడానికి ప్రయత్నించారు.
సమయంలో ఎదుటి పక్షం వారు సర్వేయర్ గారి పైన కూడా దాడికి దిగి, సర్వే జరగకుండా అడ్డుకున్నారు. దీనివల్ల ఇంతవరకు ఎటువంటి రిపోర్టు అందలేదు. వారిపై చర్యలు తీసుకోని సమస్యను పరిష్కరించాలని కోరాడు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన ఆవుల శ్రీకాంత్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. కర్నూలుకు చెందిన కోడితం శ్రీనివాసులు అనే వ్యక్తి, తమ పొలాన్ని (సర్వే నెం: 243/1, విస్తీర్ణం 2.32 ఎకరాలు) కంకర ఫ్యాక్టరీ కోసం 12 ఏళ్ల లీజుకు తీసుకుంటానని నమ్మించాడు.
లీజు అగ్రిమెంట్ అని చెప్పి తన తండ్రిని రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ ఆయనకు మద్యం తాపించి, మత్తులో ఉన్న సమయంలో లీజు పత్రాలకు బదులు సేల్ డీడ్ (అమ్మకం పత్రాలు) పై సంతకాలు చేయించుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ (తేదీ: 29062002) చేయించు కున్నాడు. ఎటువంటి మైనింగ్ అనుమతులు, లైసెన్సులు లేకపోయినా దౌర్జన్యంగా బ్లాస్టింగ్లు చేస్తూ కంకర ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. లీజు గడువు ముగిసిన తర్వాత తమ పొలం తమకు ఇవ్వమని అడిగితే.. “పొలం నేను కొన్నాను, వస్తే చంపేస్తాను” అంటూ కోడితం శ్రీనివాసులు తుపాకీతో బెదిరిస్తున్నాడు. తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: