हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Hyderabad: జోయలుక్కాస్ జ్యుయెలరీలో భారీ చోరీ

Tejaswini Y
Hyderabad: జోయలుక్కాస్ జ్యుయెలరీలో భారీ చోరీ

Hyderabad (జూబ్లీహిల్స్) : జల్సాలకు అలవాటు పడ్డాడు.. ఖరీదైన వాహనాల్లో చక్కర్లు కొట్టాలనుకున్నాడు. పనిచేసే షాపు లో మొదట ఒక బంగారు బిస్కెట్ను తన కాలి బూటులో దాచాడు. ఎవరు గుర్తించకపోవడంతో అప్పుడప్పుడు అనుమానం రాకుండా దాదాపు పది బంగారు బిస్కెట్లను బూటులో పెట్టి చోరికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో నమోదైంది. దుకాణ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు 24 గంటలు తిరక్కుండానే నిందితుడిని అరెస్ట్ చేశారు.

Read Also: Elections : తెలంగాణ లో MPTC, ZPTC ఎన్నికలపై నేడు క్లారిటీ!

Hyderabad: Massive theft at Joyalukkas Jewellery
Hyderabad: Massive theft at Joyalukkas Jewellery

వీటి విలువ రూ. 1.65 కోట్లు.. స్వాధీనం

అతని వద్ద నుంచి కిలో బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి కథనం ప్రకారం. పంజా గుట్టలోని జోయలుక్కాస్ జ్యుయెలరీ షోరూంలో దాదాపు ఒకొక్కటి వంద గ్రాము లతో కూడిన పది బంగారు బిస్కెట్లు మాయ మైనట్లు ఈ నెల 14న దుకాణ ప్రతినిధులు గుర్తించారు. దాదాపు రూ. 1.62 కోట్ల విలువైన కిలో బంగారం(Joyalukkas Theft) కనిపించక పోవడంతో వెంటనే సీసీటీవీ పుటేజీలను పరిశీలిం చారు. అందులో భాగంగా కారంపూడి గోపాలకృష్ణ అనే సేల్స్ మాన్ కాలిబూట్లలో బంగారు బిస్కెట్లు పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నట్లు గుర్తించారు. దీంతో స్టోర్ మేనేజర్ సెబాస్టియన్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట ఎసిపి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ రామకృష్ణ, డిఐ నాగరాజు, డిఎస్సై సురేష్ బృందం నిందితుడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన కారంపూడి గోపాల కృష్ణ(25)గా నిందితుడిని గుర్తించి అతని వద్ద నుంచి ఒక కిలో బంగారు బిస్కెట్లు స్వాధీనం వివరించారు. వాటితోపాటు ఒక సెల్ఫోన్, బైకు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జల్సాల కోసం ఈ చోరికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుడు ప్రాథమికంగా అంగీకరించాడు. కాగా నగల దుకాణ యజమానులు తమ స్టోర్ లోపల, బయట, అనుబంధ రహదారులు, సెల్లార్ల పార్కింగ్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను మరింత ఎక్కువగా, నాణ్యమైన వాటిని ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సూచించారు. ఉద్యోగుల రాకపోకలపై దృష్టి పెట్టాలని, భద్రతా చర్యల విషయంలో రాజీ లేకుండా వ్యవహరించాలని సూచించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870