విజయవాడ : Andhra Pradesh: ఆర్దిక సంఘం నిధులు, సాధారణ నిధుల వినియోగంపై రాష్ట్రప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించాలని సర్పంచ్ల సంఘం నాయకులు ప్రభుత్వానికి విజుప్తి చేసారు. ఈమేరకు సోమవారం సచివాలయంలో గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను కలిసిన ఆంద్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వేల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు, అఖిలభారత పంచాయతీ పరిషత్ (డిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు వినతి పత్రం అంది చేసారు. కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమీషన్ మార్గదర్శకాల ప్రకారం ఈనిధులను ఖర్చుచేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం (Government) ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
Read Also: President Droupadi Murmu : నేడు విశాఖకు రాష్ట్రపతి

పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయం నుండి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం 15వ ఆర్థికసంఘం నిధు లను కరెంట్బకాయిలు, గ్రీన్ అంబాసిడర్ జీతాలు, చెత్తసేకరణ వంటి అంశాలకే ఖర్చుచేయా లన్న ఆదేశాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గతంలో మాదిరిగానే సిసిరోడ్ల నిర్మాణం, అంగన్వాడిల నిర్మాణం, పాఠశాల భవనాలు, సెడ్లై డ్రైయిన్లు, విద్యుత్ పరికరాల కొనుగోలుకు ఈనిధులను వినియోగించుకునేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు బిల్లులు చెల్లించక పోవటంతో కాంట్రాక్టర్లు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో అప్లోడ్ చేసిన బిల్లులను పెండింగ్‌లో ఉంచారని వాటికి నిధులు విడుదల చేయాలని కోరారు. వీరి వినతికి సానుకూలంగా స్పందించిన శశిభూషణ్ కుమార్ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామి ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: