हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Hyderabad: డబ్బుల కోసం వ్యాపారి కిడ్నాప్ యత్నం.. 7గురు అరెస్టు

Tejaswini Y
Hyderabad: డబ్బుల కోసం వ్యాపారి కిడ్నాప్ యత్నం.. 7గురు అరెస్టు

Hyderabad (సరూర్ నగర్) : డబ్బుల కోసం ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన 9 మంది నిందితుల్లో ఏడుగురిని బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి కత్తులు, గొడ్డలితో పాటు ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాలాపూర్ పిఎస్లో ఇన్స్పెక్టర్ సుధాకర్ తో కలిసి ఆదిభట్ల ఎసిపి ప్రదీప్కుమారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Read Also: Elections : తెలంగాణ లో MPTC, ZPTC ఎన్నికలపై నేడు క్లారిటీ!

Hyderabad: Attempt to kidnap businessman for money.. 7 arrested
Hyderabad: Attempt to kidnap businessman for money.. 7 arrested

కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన అమెజాన్, ప్లిఫ్ కార్ట్ సెకండ్ సేల్స్ వ్యాపారం చేసే సయ్యద్ మోహినుద్దీన్ వ్యాపారనిమిత్తం గోడౌన్ పరిశీలనకు ఈ నెల 10న తన వద్ద పని చేసే ముస్తఫాతో కలిసి అలీషాన్ హోటల్ సమీపానికి వచ్చారు. అదే సమయంలో కాలాపత్తర్ ప్రాంతానికే చెందిన అసద్, జహంగీర్లు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి బలవంతంగా మోహినుద్దీన్ను షాహిన్నగర్ సగాఫ్ కాలనీకి తీసుకెళ్ళారు. అక్కడ ఖుద్దూస్, ఇక్బాల్ అనే ఇద్దరు వచ్చి వారితో కలిసారు. ఈ మేరకు లక్ష రూపాయలు ఇవ్వాలని వారు వ్యాపారిని డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బులు లేవని వ్యాపారి అనడంతో అసద్ కత్తితో దాడి చేశాడు.

అతనితో పాటు మరికొందరు సైతం దాడి చేయగా మోయినుద్దీన్ గాయాలపాలయ్యాడు. దీంతో గాయాల బాధకు బిగ్గరగా కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. తర్వాత అక్కడి నుండి బాధితుడు ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళాడు. అనంతరం బాధితుడు బాలాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన పోలీసులు విచారణ జరిపి కిడ్నాప్, దోపిడీ యత్నం, హత్యాయత్నానికి పాల్పడిన మహ్మద్ అసద్ (32), మహ్మద్ జహంగీర్ (23), మహ్మద్ నవాజ్ (26), మహ్మద్ సయీద్ (19), మహ్మద్ అల్తాఫ్ (27), మహ్మద్ ఇక్బాల్ మోహినుద్దీన్ (42), ఖుద్దూస్ బస్ఈవీ (30) లను అదుపులోకి తీసుకొని మారణాయుధాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మహ్మద్ ఇమ్రాన్, సైఫ్ ఫైజల్ పరారీలో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?

డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం
1:48

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870