KTR municipal strategy Telangana : హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది పట్టణాల్లో ఎన్నికల పరిస్థితులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు సీనియర్ నేతలను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరిపి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.
స్థానికంగా కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, ఒత్తిళ్లు వంటి ఆరోపణలపై సమాచారం సేకరించిన కేటీఆర్, పార్టీ నాయకత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, న్యాయంగా జరిగేలా పర్యవేక్షించేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also: T20 World Cup 2026: నేపాల్‌పై వెస్టిండీస్ భారీ విజయం

ప్రత్యేక ఇన్‌ఛార్జుల నియామకం:
తొర్రూర్: ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
జనగామ: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
క్యాతనపల్లి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
కాగజ్‌నగర్: మాజీ మంత్రి జోగు రామన్న
జహీరాబాద్: ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ఈ నియామకాలతో హంగ్ పరిస్థితులు ఉన్న పట్టణాల్లో రాజకీయ సమీకరణాలు మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: