Pocket Novel movie : తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ కథాంశాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు “పాకెట్ నావెల్” అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం చెన్నైలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.
చిత్ర నిర్మాణ సంస్థ టైలర్ డర్డెన్ అండ్ కింగ్ ఫిస్ట్ (TDKF) సోషల్ మీడియా ద్వారా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

చెన్నైలోని వడపళనిలో సాదాసీదా పూజా కార్యక్రమంతో చిత్రీకరణ ప్రారంభమైనట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘కొలైగారన్’, ‘వదంది’ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందిన ఆండ్రూ లూయిస్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రముఖ నటుడు కిషోర్ ఒక కీలక పాత్రలో నటించనుండగా, సత్యరాజ్ నటరాజన్ ఎడిటర్‌గా, యుగభారతి గీతరచయితగా పనిచేస్తున్నారు. విభిన్న కథనం, శక్తివంతమైన సాంకేతిక బృందంతో ఈ సినిమా భారీ అంచనాలను సృష్టిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: