हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Municipal Elections: కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే?

Saritha
Municipal Elections: కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే?

Municipal Elections: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకున్నారు. మొత్తం 7 చోట్ల ఎన్నికలు జరగ్గా అందులో 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. సీపీఐ, బీజేపీ పార్టీలు చెరో కార్పొరేషన్‌పై తమ జెండా ఎగురవేసుకున్నాయి. మరోవైపు.. 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినప్పటికీ హంగ్ ఏర్పడిన కారణంగా 11 పురపాలికల్లో ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. మిగిలిన వాటిలో చాలా వరకు అధికార కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ పీఠాలను దక్కించుకోగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు కైవసం చేసుకున్నాయి.

Read Also: Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

Municipal Elections: కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే?
Municipal Elections: Are these the newly elected mayor and deputy mayors?

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీపీఐ దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ఎ న్నికయ్యారు. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ హస్తగతమైంది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్‌గా మమత శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా సురేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ దక్కించుకుంది. రామగుండం మేయర్‌గా 46వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా 57వ డివిజన్ కార్పొరేటర్ పాతిపెల్లి ఎల్లయ్యను ఎన్నుకున్నారు. నల్గొండ కార్పొరేషన్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. నల్గొండ కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్‌గా బుర్రి చైతన్య రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌ హస్తగతమైంది. తొలి మేయర్‌గా ధర్ణి మధు ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా రమ్యను ఎన్నుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870