Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, వృద్ధాప్యాన్ని సవాల్ చేస్తూ అథ్లెటిక్స్‌లో పతకాలు సాధిస్తున్న 78 ఏళ్ల రామసుబ్బమ్మను ఘనంగా ప్రశంసించారు. వయసు సంకల్పానికి అడ్డుకాదని ఆమె నిరూపిస్తున్నారని, ఆమె కథ నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ‘రాకింగ్ రామసుబ్బమ్మ’ అంటూ వచ్చిన కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
Read Also:IND vs PAK: యువి రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్
నెల్లూరు జిల్లా కావలికి చెందిన రామసుబ్బమ్మ గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఇళ్లలో పనులు చేసుకుంటూనే ట్రాక్‌పై సాధన కొనసాగిస్తూ ఇప్పటివరకు 12 బంగారు పతకాలను గెలుచుకున్నారు. త్వరలో అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున పోటీలకు సిద్ధమవుతున్నారు.
సజ్జనార్ ఆమె పట్టుదలని ఉదాహరణగా చూపిస్తూ, యువత బద్ధకం, స్మార్ట్‌ఫోన్ వ్యసనం, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కష్టాన్ని నమ్ముకుని లక్ష్యాలను సాధించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రామసుబ్బమ్మలాంటి వ్యక్తులే సమాజానికి నిజమైన ప్రేరణ అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: