పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఆయన సోదరి కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులో ఆయనకు అందుతున్న చికిత్సపై ఇమ్రాన్ సోదరి అలీమా ఖానుమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, జైలులో ఆయన పట్ల హెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని ఫైర్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ 800 రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో తన సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై అలీమా ఖానుమ్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఆసిమ్ యూసుఫ్‌తో ఒక కుటుంబ సభ్యుడి సమక్షంలో చికిత్స అందించాలని తాము మొదటి నుంచి కోరుతున్నామని అలీమా ఖానుమ్ తెలిపారు. కుటుంబం తరపున హాజరయ్యేందుకు తాము సూచించిన డాక్టర్ల పేర్లను ప్రభుత్వం తిరస్కరిస్తోందని ఆమె ఆరోపించారు. మొదట ఉజ్మా ఖాన్ పేరును ప్రతిపాదించగా ప్రభుత్వం తిరస్కరించింది. అ తర్వాత స్వయంగా వారి బంధువు ప్రముఖ వైద్యుడు బుర్కీ పేరును ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఆయనను కూడా అనుమతించకపోవడంపై అలీమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Amit Shah: రాహుల్, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని అంచనాపై వైద్య బోర్డును ఏర్పాటు
ఫిబ్రవరి 12న తన కుడి కన్ను కేవలం 15 శాతం మాత్రమే చూడగలుగుతుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని సూచించింది. అంతేకాకుండా ఫిబ్రవరి 16లోపు తన పిల్లలతో మాట్లాడుకునే అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం ఐదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం ఇమ్రాన్ ఖాన్ పరీక్షించినట్లు చెప్పాయి. దాదాపు గంటపాటు కంటి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నాయి. కంటితో పాటు రక్త నమూనాలు సేకరణ, రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపాయి. తదుపరి చికిత్స జైల్లోనే కొనసాగాలా లేదా ఆస్పత్రికి తరలించాలా అన్నది బోర్డు నిర్ణయించనుందని వెల్లడించాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: