Telangana: చాలా మందికి స్ట్రీట్ ఫుడ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఆఫీస్ పని ముగిసిన తర్వాత లేదా సాయంత్రం వేళ బయటకు అడుగుపెడితే చాలు బజ్జీలు, పునుగులు, మిర్చి బజ్జీ, పానీపూరీ, చాట్ వంటి వాటి వాసన మనసును ఆకర్షిస్తుంది. రోజంతా అలసిపోయిన శరీరానికి కాస్త రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ దొరికితే చాలు ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. అయితే ఇష్టంతో పాటు భయమూ చాలామందిలో ఉంటుంది. ఈ ఆహారం తయారీలో ఎలాంటి పదార్థాలు వాడుతున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, తాగునీరు శుభ్రమేనా, చుట్టుపక్కల పరిసరాలు హైజినిక్‌గా ఉన్నాయా అనే సందేహాలు ఉంటాయి.
Read Also: Formula E Car Race Case : కేటీఆర్ కు షాక్ ఇవ్వబోతున్న ఏసీబీ అధికారులు?
ఈ నేపథ్యంలోనే ప్రజలకు హైజనిక్ స్ట్రీట్ ఫుడ్ అందేలా చూడటం కోసం కేంద్రం ప్రభుత్వం కీలక ప్రయత్నం చేస్తోంది. దేశవ్యాప్తంగా 100 హెల్తీ అండ్ హైజినిక్ ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 86 సెంటర్లకు అనుమతులు ఇచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక్కో సెంటర్ కోసం కోటి రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ లోని హనుమకొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ నగరాల్లో హెల్తీ అండ్ హైజనిక్ ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేయనున్నారు.

FSSAI సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే ఫుడ్ స్ట్రీట్స్‌లో స్టాల్స్ కేటాయిస్తారు
ఇప్పటికే ఈ నగరాల్లో ఫుడ్ స్ట్రీట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను సైతం గుర్తించారు. సామాన్య ప్రజలు ఆహారం క్వాలిటీ గురించి, అందులో వాడిన పదార్థాల గురించి ఎలాంటి భయం లేకుండా.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్‌ను ఎంజాయ్ చేసేలా ఫుడ్ స్ట్రీట్స్ ఉంటాయి. దుమ్ము ధూళితో ఇబ్బంది లేకుండా చూడటం కోసం, సులభంగా శుభ్రం చేసేందుకు వీలుగా ఫుడ్ స్ట్రీట్స్ ప్రాంగణం మొత్తం టైల్స్ వేస్తారు. రాత్రి టైంలో ఆకర్షణీయమైన లైటింగ్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే ఫుడ్ స్ట్రీట్స్‌లో స్టాల్స్ కేటాయిస్తారు.
FSSAI నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. ఆహార పదార్థాలను ఎలా జాగ్రత్తపర్చాలి, పరిశుభ్రంగా ఎలా ఉండాలనే విషయమై వెండర్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. ఈ స్టాల్స్‌లో వంట చేసే వారు, ఆహారాన్ని అందించేవారు తప్పనిసరిగా చేతులకు గ్లోవ్స్ పెట్టుకోవాలి. వెంట్రుకలు ఆహారంలో పడకుండా తలకు ఆఫ్రాన్ పెట్టుకోవాలి. గోర్లు పెంచుకోవడం, వేళ్లకు ఉంగరాలు పెట్టుకోవడం కుదరదు. పొగాకు నమలడం, సిగరెట్లు, బీడీలు కాల్చడం నిషేధం. ఆహార పదార్థాల తయారీకి వాడే ముడిసరుకులతోపాటు, ఫుడ్ ఐటెమ్స్ క్వాలిటీని ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: