KTR Formula E race : ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఈ వారంలోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశముందని సమాచారం. చార్జిషీట్లో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదు చేసిన ఈ కేసులో విచారణ దాదాపు పూర్తయింది. చార్జిషీట్‌కు తుదిరూపం ఇచ్చిన ఏసీబీ అధికారులు, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై ప్రాసిక్యూషన్‌కు డీవోపీటీ అనుమతి కోసం ఎదురుచూశారు. తాజాగా ఆ అనుమతి రావడంతో చార్జిషీట్ దాఖలు ప్రక్రియ వేగవంతమైంది. కేసుకు సంబంధించి ఎలక్ట్రానిక్, డిజిటల్ ఆధారాలను కూడా సేకరించినట్లు సమాచారం.
Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణ వల్ల హెచ్ఎండీఏకు సుమారు ₹75.88 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ పేర్కొంటోంది. రేసు నిర్వహణ బాధ్యతలు ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థకు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు వచ్చాయనే అంశాన్ని కూడా దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది.
ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గతంలోనే అనుమతి ఇచ్చారు. 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్, అర్వింద్ కుమార్ తదితరులను విచారించారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత తదుపరి చర్యలు ఏమిటన్నది ఆసక్తిగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: