తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.కరీంనగర్ మినహా, మిగతా కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్‌కే దక్కే అవకాశముంది. మరోవైపు 60కి పైగా మున్సిపాలిటీలను ఆ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో హంగ్ ఏర్పడిన చోట ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.
Read Also: Telangana Municipal : రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక

మద్దతు కోసం ప్రధాన పార్టీలు చర్చలు
మున్సిపల్ పీఠాలను దక్కించుకోవడంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మేజారిటీ స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్న పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయగా, హంగ్ ఏర్పడిన చోట స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం ప్రధాన పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. అంతేకాకుండా, పార్టీ ఫిరాయింపులు జరగకుండా చాలా చోట్ల క్యాంపు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: