Pakistan six spinners record : కొలంబోలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అనుసరించిన వ్యూహం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో మొత్తం ఏడుగురు బౌలర్లను వినియోగించగా, వారిలో ఆరుగురు స్పిన్నర్లు ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఆరుగురు స్పిన్నర్లను ఉపయోగించిన తొలి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. సాధారణంగా పేసర్లకు అనుకూలించే పిచ్‌లపై కూడా ఈసారి స్పిన్ అస్త్రాన్ని నమ్ముకోవడం క్రికెట్ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత

మ్యాచ్ ప్రారంభంలోనే కెప్టెన్ సల్మాన్ అఘా స్వయంగా మొదటి ఓవర్ వేసి, ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మను డకౌట్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చాడు. అనంతరం నాలుగో ఓవర్లో పార్ట్‌టైమ్ స్పిన్నర్ సైమ్ అయూబ్‌ను బౌలింగ్‌కు దింపారు. బ్యాటర్‌గా పేరుగాంచిన అయూబ్, బంతితోనూ మెరుపులు మెరిపించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు.
సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్ కిషన్ (78)ను అవుట్ చేయడమే కాకుండా, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిఖ్ కూడా స్పిన్ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: