India 175 score : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో భారత ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఒక దశలో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించిన భారత్, పాక్ స్పిన్నర్ల మాయాజాలంతో మధ్యలో తడబడింది.
మ్యాచ్ ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై దాడి చేశాడు. కేవలం 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన ఇషాన్, 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. తిలక్ వర్మ (25)తో కలిసి కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
Read Also: TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్
భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్న సమయంలో (India 175 score) పార్ట్‌టైమ్ స్పిన్నర్ సైమ్ అయూబ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ముందుగా ఇషాన్ కిషన్‌ను అవుట్ చేసి, వెంటనే తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యాలను వరుస బంతుల్లో ఔట్ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. చివర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొన్ని మెరుపు షాట్లతో స్కోరును ముందుకు నడిపించడంతో భారత్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్ధేశించింది.
పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఏకంగా ఆరుగురు స్పిన్నర్లను వినియోగించి అరుదైన రికార్డు సృష్టించగా, సైమ్ అయూబ్ మూడు వికెట్లతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. భారత్ 176 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందు ఉంచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: