కర్నూలుకు చెందిన కోవా బన్ వ్యాపారి వలీ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘటన తర్వాత వలీకి వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు నారా లోకేష్, పరిటాల శ్రీరామ్, బైరెడ్డి శబరి, వలీకి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ,నాగబాబు (Nagababu) కూడా వలీకి మద్దతు ప్రకటించారు.
Read Also: Prakasham: హాస్టల్ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానస్పద మృతి
ఏవైనా అనుమానాలు ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలిస్తారు
వలీని తన వద్దకు పిలిపించుకున్న నాగబాబు అతనికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని నాగబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు. కుటుంబ పోషణకు కోవా బన్ అమ్ముకునే ఓ సాధారణ పౌరుడైన వలీని.. పనిగట్టుకుని కొంతమంది భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని నాగబాబు అన్నారు. కొంతమంది అత్యు్త్సాహంతో ఓ కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.మనదేశంలో కోట్ల మంది..

చిరు వ్యాపారులు ఉన్నారని, అలాంటి వారికి చేతనైతే సహాయం చేసి చేయూత ఇవ్వాలే కానీ.. నిరాధార ఆరోపణలతో ఇలా కడుపు మీద కొట్టడం సరైంది కాదని నాగబాబు అన్నారు. న్యాయంగా వ్యాపారం చేసుకునేవారికి కూటమి సర్కారు అండగా ఉంటుందని నాగబాబు భరోసా ఇచ్చారు. చిరు వ్యాపారులు అమ్మే పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలిస్తారని.. ఏవైనా అనుమానాలు ఉంటే వారిని సంప్రదించాలని నాగబాబు సూచించారు. అలా కాకుండా ఓ నిరుపేద చిరు వ్యాపారిని అవమానించడం సరైంది కాదన్నారు నాగబాబు..
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: