Jagityala Congress : జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ జోక్యం చేసుకోవడంతో వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ సవాంగ్ ప్రజాభవన్‌లో ఇరు వర్గాల నేతలతో చర్చలు జరిపి సయోధ్యకు దారి తీసినట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల సమయంలో రెండు వర్గాలు విడివిడిగా పోటీ చేయడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఇరు వర్గాలు గణనీయ ఫలితాలు సాధించడంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఐక్యత అవసరమని అధిష్టానం భావించింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి కలిసి పనిచేయాలని సవాంగ్ సూచించగా ఇరువురు నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
Read Also: TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

పదవుల కేటాయింపుపై జరిగిన చర్చలో పార్టీ కోసం దీర్ఘకాలంగా పని చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. చైర్మన్ పదవి ఒక వర్గానికి, వైస్ చైర్మన్ మరో వర్గానికి ఇవ్వడం లేదా రెండున్నరేళ్లు చొప్పున పదవి పంచుకునే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగిత్యాలలో కాంగ్రెస్ ఐక్యత దిశగా అడుగులు పడినట్లు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: