India vs Pakistan T20 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. గాయంతో దూరమైన విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుని జట్టులోకి తిరిగి రావడం భారత్‌కు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.
గ్రూప్-ఏలో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాయి. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించి అపజయం ఎరుగకుండా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం మెరుగైన రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
Read Also: TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

ఇప్పటికే వరుస విజయాలతో ఊపు మీదున్న ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఫలితంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
భారత జట్టు
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ జట్టు
సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహమ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: