తెలంగాణ ప్రభుత్వం(Telangana) ప్రవేశపెట్టిన యూరియా యాప్ రైతులకు ఎంతో సహాయకారిగా మారిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 14 నాటికి సుమారు 12.73 లక్షల మంది రైతులు ఈ యాప్ ద్వారా 50.48 లక్షల యూరియా సంచులను బుక్ చేసుకున్నారని తెలిపింది.
Read Also: Kothagudem mayor election : కొత్తగూడెం మేయర్ టెన్షన్, సీఎం రేవంత్‌తో కీలక భేటీ!

పట్టాదార్ పాస్ బుక్ ఉన్న రైతులు, RoFR లబ్ధిదారులు, అలాగే కౌలు రైతులు మాత్రమే ఈ యాప్‌లో నమోదు చేసుకుని బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ విధానం ద్వారా నకిలీ లేదా మధ్యవర్తుల దందాకు అవకాశం లేకుండా అసలైన రైతులకే యూరియా అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ యాప్ సేవలు(Telangana) అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. డిజిటల్ బుకింగ్ విధానం వల్ల రైతులకు ఎరువుల సరఫరా సులభంగా, పారదర్శకంగా జరుగుతుందని పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: