టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ (Ravitej) మరో ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా, దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ కథానాయికను అధికారికంగా పరిచయం చేశారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
Read Also: Mrunal Thakur marriage : మృణాల్ పెళ్లి ఎప్పుడు? హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
మేకర్స్ సన్నాహాలు
రవితేజ (Ravitej) కెరీర్‌లో 77వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో ఆయన ఒక అయ్యప్ప భక్తుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు హీరోయిన్ లుక్ కూడా తోడవడంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ ఈ కథ సాగనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: