తమ సంస్థను రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లు ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ చేశారని తెలంగాణ (Telangana) జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, తమపై జరుగుతున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు.
Read Also: Telangana: కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
కానీ తమను లక్ష్యంగా చేసుకున్న వారికి ఒకటే విషయం చెబుతున్నానని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. ఇప్పుడే తొందరపడి మాట జారవద్దని, తమపై కారుకూతలు కూయవద్దని బీఆర్ఎస్ వారిని హెచ్చరించారు. ఇప్పటికైనా మీ తప్పులను సరిదిద్దుకోవాలని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ మద్దతివ్వడం విడ్డూరం
అధికారంలో ఉన్నప్పుడు వారు ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్, ఈసారి 16 స్థానాలకే పరిమితమైందని కవిత గుర్తు చేశారు. ప్రజల మద్దతును ఎందుకు కోల్పోయామో బీఆర్ఎస్ ఆలోచించాలని సూచించారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేసిందని కవిత ఆరోపించారు. ఆ రెండు పార్టీల పొత్తుకు ఇది తొలి మెట్టు అన్నారు. కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయిన సీపీఐకి కొత్తగూడంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతివ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌పై సాంబశివరావు చేసిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా అని బీఆర్ఎస్ను ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: