ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు పొందిన కిన్మెమై ప్రీమియం రైస్ జపాన్‌లో(Japan) ప్రత్యేకంగా సాగు చేస్తారు. ఈ అరుదైన బియ్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడంతో అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పొందింది.
Read Also:Tariq Rahman: 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ప్రధానిగా ఓ పురుషుడు

ఈ బియ్యం ధర సాధారణ ప్రజలకు అందని స్థాయిలో ఉండగా, కిలో ధర రూ.12,500 నుంచి రూ.15,000 వరకు పలుకుతుంది. జపాన్‌లోని టోయో రైస్(Japan) కార్పొరేషన్ ప్రత్యేక సాంకేతికతతో దీనిని తయారు చేస్తోంది. కిన్మెమై బియ్యం పోషకాల పరంగా చాలా ప్రత్యేకమైనది. సాధారణ బియ్యంతో పోలిస్తే ఇందులో లిపోపాలిసాకరైడ్లు (LPS) ఆరు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థం శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఈ బియ్యం ధాన్యాలను శుభ్రం చేసే ప్రత్యేక ప్రక్రియలో తయారు చేస్తారు. అందువల్ల వండే ముందు కడగాల్సిన అవసరం లేకుండా నేరుగా వండుకోవచ్చు. ఇది సమయం ఆదా చేయడమే కాకుండా పోషకాలు నష్టం కాకుండా కాపాడుతుంది. ఈ ప్రీమియం బియ్యం ప్రధానంగా విలాసవంతమైన హోటళ్లలో, రెస్టారెంట్లలో, ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ధనిక వినియోగదారుల వద్ద ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారంపై పెరుగుతున్న ఆసక్తితో దీని డిమాండ్ కూడా పెరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: