हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

US: ఇరాన్​లో​ అధికార మార్పు జరిగితే మంచిది: ట్రంప్

Vanipushpa
US: ఇరాన్​లో​ అధికార మార్పు జరిగితే మంచిది: ట్రంప్

ఇరాన్‌పై సైనిక చర్యకు సంబంధించిన ఆలోచనలు కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అధికార మార్పు జరిగితే అది ఉత్తమ పరిణామం అవుతుందని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం మధ్యప్రాచ్యానికి రెండో విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గటంలకే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇరాన్‌లో అధికార మార్పు జరిగితే అదే ఉత్తమం. 47 ఏళ్లుగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే అపార శక్తి అక్కడికి చేరుకుంది. మరిన్ని బలగాలు కూడా వెళ్తున్నాయి. దీనిని ఒకేసారి పూర్తిగా ముగిస్తే మంచిదే. ఇరాన్‌పై తన ప్రధాన లక్ష్యం అణు కార్యక్రమాన్ని నియంత్రించడమే అయినప్పటికీ, అది మాత్రమే కాకుండా ఇతర అంశాలు కూడా కీలకం. చర్చలు విజయవంతం అవుతాయని అనుకుంటున్నా. విఫలమైతే అది ఇరాన్‌కు చాలా చెడు రోజు అవుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Read Also: Feb 14: పుల్వామా ఉగ్రదాడికి 7 ఏళ్లు – శ్రీనగర్‌లో హై అలర్ట్

US: ఇరాన్​లో​ అధికార మార్పు జరిగితే మంచిది: ట్రంప్
US: ఇరాన్​లో​ అధికార మార్పు జరిగితే మంచిది: ట్రంప్

అణు కార్యక్రమంపై తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి

ఇరాన్ తన అణు కార్యక్రమంపై తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి పెంచుతూ, ట్రంప్ ప్రభుత్వం మధ్యప్రాచ్యానికి రెండో విమాన వాహక నౌకను పంపాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా పేరుగాంచిన యూఎస్​ఎస్​ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ ప్రస్తుతం కరేబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియా దిశగా బయలుదేరుతోంది. గతంలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన ఆపరేషన్‌లో కూడా యూఎస్​ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే మధ్య ప్రాచ్యంలో ఉన్న యూఎస్​ఎస్ అబ్రహం లింకన్ నౌకతో పాటు, ఇప్పుడు ‘ఫోర్డ్’ కూడా చేరనుంది. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, యుద్ధనౌక యూఎస్​ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ అవసరం అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఒమన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇరాన్‌తో చర్చలు

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత ఇప్పటికే అస్థిరంగా ఉన్న మధ్యప్రాచ్యంలో, ఈ పరిణామం మరో ప్రాంతీయ యుద్ధానికి దారితీయవచ్చని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వారం ఒమన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇరాన్‌తో చర్చలు జరుగుతాయని అమెరికా భావించినప్పటికీ, అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సైనిక ఒత్తిడిని పెంచాలని భావిస్తోంది. ఇదే సమయంలో దేశవ్యాప్త నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల అంతర్గత ఒత్తిడి పెరుగుతోంది. మృతుల కోసం 40వ రోజు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబాలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను మరింత పెంచుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870