हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

AP: లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు

Saritha
AP: లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు

(AP) ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ లిక్కర్ షాపులకు మద్యం సరఫరా చేసే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. విజిలెన్స్ అధికారుల విచారణ అనంతరం ఈనెల 10న కేసు నమోదు చేసింది సీఐడీ. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ బాధ్యతలను సిట్ చీఫ్‌ ఎస్వీ రాజశేఖర్‌ బాబుకు అప్పగించింది. సుమారు రూ.200 నుంచి రూ.400 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం.

Read Also: Andhra Pradesh: నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి

AP: లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు

మరోవైపు, లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. (AP) ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ స్కామ్ లో రూ. 3,500 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు సిట్ అధికారులు అంచనా వేశారు. ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. పలువురు వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 9 మంది విదేశాల్లో తలదాచుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా దర్యాప్తు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870